- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
19 నుంచి ప్లాస్టీ వరల్డ్ ఎగ్జిబిషన్
దిశ, తెలంగాణ బ్యూరో: అఖిల భారత ప్లాస్టిక్ మ్యానుఫక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి ఐదు రోజుల పాటు ప్లాస్టిక్ వర్చువల్ ఎగ్జిబిషన్ ‘ప్లాస్టీ వరల్డ్’ జరగనుంది. 68కి పైగా దేశాల నుంచి 100కి మందికి పైగా ఎగ్జిబిటర్లు, 12వేల మంది సందర్శకులతో ఎగ్జిబిషన్ సాగనుంది. దేశంలో 175నగరాలకు చెందిన 20వేల సంస్థలు, సంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల బిజినెస్ సాధించే లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌కు కేంద్ర కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ, సీపెట్‌తో పాటు దేశంలోని 15 ప్రధాన సంస్థలు మద్దతునిచ్చాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ సంస్థల సీఈఓలు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, ఎండీలు పాల్గొననున్నారు.
అమెరికా, సింగపూర్, మలేషియా, ఇటలీ, జర్మనీ, దక్షిణ కొరియా, ఇండోనేషియా తైవాన్, టర్కీ, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల నుంచి బిజినెస్ విజిటర్లు, కొనుగోలుదార్లు వర్చువల్‌లో పాల్గొంటారు. ప్లాస్టీ వరల్డ్ చైర్మన్ అజయ్ దేశాయ్ మాట్లాడుతూ.. దేశంలో విస్తరిస్తున్న రంగాల్లో ప్లాస్టిక్ ముందున్నదన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో ఐదో పెద్ద రంగం ప్యాకేజింగ్. ఈ ప్యాకేజింగ్ పరిశ్రమల నూతన శిఖరాలను అధిరోహించే సమయం ఆసన్నమైందన్నారు. వర్చువల్ వేదికగా జరిగే ప్లాస్టీ వరల్డ్ దోహదపడుతుందన్నారు.