- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా థెరపీ పనిచేయలేదట!
దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పరిస్థితి విషమించిన పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా ఉపశమనం అందించాలని డాక్టర్లు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కొవిడ్ 19 కారణంగా శరీరం మొత్తం సహకరించకుండా పోయి, వ్యాధినిరోధక శక్తి ఏ మాత్రం పనిచేయకుండా ఉన్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో దీన్ని పెద్దగా అమల్లోకి తీసుకురాకపోయినప్పటికీ పాశ్చాత్య దేశాల్లో దీన్ని ప్రత్నామ్నాయ ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభంలో ఇది మంచి ఫలితాలనే చూపించినప్పటికీ పెద్ద స్థాయిలో చూస్తే పెద్దగా ప్రయోజనం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది.
ఈ ప్లాస్మా థెరపీ వల్ల మరణాల రేటు తగ్గలేదని, అలాగే కొవిడ్ 19 విషమించడం కూడా నిరోధం కాలేదని ఈ అధ్యయనంలో తెలిసింది. భారతదేశవ్యాప్తంగా 39 పబ్లిక్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏప్రిల్ 22 నుంచి జులై 14 వరకు కాన్వాలెసెంట్ ప్లాస్మా ట్రీట్‌మెంట్ ప్రభావం గురించి వివరాలను సేకరించి అధ్యయనం చేశారు. 14 రాష్ట్రాల్లోని 464 మంది పేషెంట్లను సర్వే చేశారు. వారిలో 235 మందిని ఇంటర్వెన్షన్‌గా, 229 మందిని కంట్రోల్‌గా విడగొట్టారు. వారిలో 235 మందికి రెండు డోసుల 200 మి.లీ. సీపీని 24 గంటల పాటు ఇచ్చారు. వీరి ఫలితాలను కంట్రోల్‌లో ఉన్న 229 మందితో పోల్చి చూశారు. అయితే ఆ పోలికల్లో ఎలాంటి తేడాలు కనిపించకపోగా, మరణాల రేటులో కూడా పెద్దగా తేడా లేకపోవడంతో ప్లాస్మా థెరపీతో ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు.