- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లాస్మా సేకరణకు వాట్సాప్ గ్రూప్
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా నివారణకు ఔషధాలు కనుక్కునేందుకు అనేక ఫార్మా కంపెనీలు పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు కరోనాను నివారించే మెడిసిన్ కనిపెట్టలేదనే చెప్పవచ్చు. కరోనా బారిన పడ్డ వారు ప్రాణాలతో బయట పడాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ప్లాస్మా థెరపీ. కరోనా బారినపడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి బాధితులకు ఎక్కించడం ఒక్కటే మార్గం. అందుకే కరోనాను జయించిన వారి నుంచి ప్లాస్మా సేకరించేందుకు వరంగల్‌కు చెందిన అఖిల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి వైద్యం అందించేందుకు బాధితులందరినీ ఏకం చేశారు. ప్రభుత్వం కరోనా బారిన పడి కోలుకున్న వారి వివరాలు ఇస్తే ప్లాస్మా దానం చేయించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తామంటున్నారు. అంతేకాకుండా కరోనా అంటే భయపడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మనోధైర్యాన్ని నింపుతామని
చెబుతున్నారు.
అనుభవంలో నుంచి ఆలోచన..
వరంగల్ కు చెందిన అఖిల్ బ్రిటన్ లోని డీన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో లా చదువుకునేందుకు వెళ్లారు. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వస్తూ కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌కు రాగానే కరోనా టెస్టులు చేయిచుకున్నారు. అందులో కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగానే ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నాడు. దేశంలో అప్పటికీ కరోనా బారిన పడ్డ వ్యక్తుల్లో అఖిల్ 16 స్థానంలో ఉన్నాడు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్లాస్మా దానం చేసేందుకు సహకరించాలని కోరారు. అందుకు అఖిల్ సరే అనడంతో ఇద్దరికి ప్లాస్మా ఎక్కించారు.
450 ఎంఎల్ బ్లడ్ సేకరణ: ప్రొ. చంద్రశేఖర్, మాజీ నోడల్ అధికారి, ఎంజీఎం వరంగల్
కరోనా మహమ్మారి నుంచి కోలుకునేందుకు ఐసీఎంఆర్ తెలంగాణలో కేవలం గాంధీ ఆస్పత్రికి మాత్రమే ప్లాస్మా థెరపికీ అనుమతిచ్చింది. అది కూడా ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌కు కట్టుబడే ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తారు. కరోనా నుంచి కోలుకున్న ప్లాస్మా డోనర్ నేరుగా రావాల్సి ఉంటుంది. వారి నుంచి 450 ఎంఎల్ రక్తం సేకరించి అందులో నుంచి ప్లాస్మా వేరు చేస్తారు. క్రిటికల్ కండిషన్లో ఉన్న కరోనా పేషెంట్ కు బ్లడ్ గ్రూప్ డోనర్ ప్లాస్మా గ్రూప్ సెల్స్ మ్యాచ్ అయితే అతడికి ప్లాస్మా థెరపీ చేస్తారు. ఇదంతా గాంధీ ఆస్పత్రి నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మ్యాచ్ అవ్వదు. కనుక ఎవరూ ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసి మోసపోవద్దు.