విజిటింగ్ కార్డ్ నుంచి మొక్కలు.. కొత్త ఐడియా!

by Shyam |   ( Updated:2020-09-03 06:51:50.0  )
విజిటింగ్ కార్డ్ నుంచి మొక్కలు.. కొత్త ఐడియా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా కమ్యూనిటీ పెంచుకోవడానికి, కాంటాక్టులు పెంచుకోవడానికి, అవసరార్థం ఉపయోగపడటానికి విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు. తీసుకునేవాళ్లు కూడా అవసరం ఉన్నా, లేకున్నా విజిటింగ్ కార్డ్ తీసుకుంటారు. ఆ తీసుకున్న విజిటింగ్ కార్డును ఎక్కడ ఉపయోగిస్తారో, ఎక్కడ పడేస్తారో తెలియదు. అలా వాళ్లు తీసుకున్న విజిటింగ్ కార్డ్స్ పడేసుకుంటూ పోయి ఒక చెత్తలా పేరుకుపోతాయి. కాగా, విజిటింగ్ కార్డ్ తయారీకి ఉపయోగించే పేపర్ భూమిలో కలిసిపోవడానికి చాలా రోజులు పడుతుంది. అయితే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్.. విజిటింగ్ కార్డ్‌ను వినూత్నంగా తయారుచేయించి ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆయనేం చేశారు?

విజిటింగ్ కార్డ్‌ను సులభంగా భూమిలో కలిసిపోయే కాగితంతో చేయించారు. అంతేకాదు, ఆ కాగితం భూమిలో కలిసిపోగానే అందులో నుంచి ఒక మొక్క మొలకెత్తేలా విత్తనాలు పెట్టి తయారుచేశారు. ఈ పర్యావరణహిత ఐడియాకు నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఇదే ఐడియాను శుభలేఖలు, పుట్టినరోజులు ఇతర వాలెంటైన్, ఈవెంట్స్ కార్డుల తయారీకి కూడా ఉపయోగిస్తే బాగుంటుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా దుస్తులకు వేసే ప్రైజ్ ట్యాగ్‌లు, పాంప్లెట్‌లకు కూడా ఇలా చేస్తే బాగుంటుందని అన్నారు. ఇక వేరే ప్రొఫెషన్‌లో ఉండే వారు ఇలాంటి విజిటింగ్ కార్డ్స్ ఎక్కడ తయారో చేస్తారో ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ చెప్పాలంటూ కామెంట్‌లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed