సరిహద్దులో సైన్యం లేకుంటే నిద్రపోలేము: రేగా కాంతారావు

by Sridhar Babu |
సరిహద్దులో సైన్యం లేకుంటే నిద్రపోలేము: రేగా కాంతారావు
X

దిశ, మణుగూరు: భారతదేశ సరిహద్దున ఆర్మీ సైన్యం లేకుంటే దేశం కంటినిండా నిద్రపోలేదని ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ సింగ్ రావత్ అకాలమరణంపై చింతిస్తూ విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సరిహద్దున ఆర్మీ సైన్యం లేకుండా దేశం కంటినిండా నిద్రపోదని వ్యాఖ్యానించారు. తెగువకు ధీరుడు, గొప్ప సేనాధిపతి బిపిన్ సింగ్ రావత్ అని అభివర్ణించారు. రావత్ మరణించడం దేశానికి తీరని లోటన్నారు. ప్రమాదంలో మరణించిన వారందరికీ సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Advertisement

Next Story