- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 ఏళ్లకే పైలెట్ లైసెన్స్!
దిశ, వెబ్‌డెస్క్: చిన్నపుడు పైన ఎగురుతున్న విమానాన్ని చూసినపుడు.. అందులో ఎక్కాలని కొందరు, దాన్ని నడపాలని మరికొందరు కలలు కంటారు. దాన్ని నడపాలనుకునే వారిలో ఆడవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అయేషా అజిజ్ అలా ఊరుకోలేదు. విమానాన్ని నడపాలని అనుకోవడమే కాదు, దాన్ని చిన్నవయసులోనే సాకారం చేసుకుని రికార్డు సృష్టించింది. భారతదేశంలో 16 ఏళ్ల వయస్సులోనే పైలెట్ లైసెన్స్ పొంది రికార్డు నెలకొల్పింది. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పుట్టి, ముంబైలో పెరుగుతున్న ఆయేషాకు చిన్నప్పటి నుంచి విమానాలంటే పిచ్చి. ఆ పిచ్చి పెరిగి బాంబే ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరేవరకు దారితీసింది.
ముంబైలో ఆమె తండ్రి అబ్దుల్ అజీజ్ ఒక వ్యాపారవేత్త. ఆమెకు మొదటి నుంచి తండ్రి సపోర్ట్ చేశాడు. అందుకే తాను ఈరోజు కళను నెరవేర్చుకోగలిగినట్లు ఆయేషా తెలిపింది. 2011లో స్టూడెంట్ పైలెట్ లైసెన్స్, 2017లో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ అందుకున్న ఆయేషా తన తల్లిదండ్రులు కూర్చున్న విమానాన్ని నడపడం తాను మరిచిపోలేని సంఘటన అని చెబుతారు. అంతేకాకుండా ఆమె గ్రాడ్యుయేషన్ చేస్తున్నపుడు నాసాలో వ్యోమగామి శిక్షణ కూడా పొందింది. సునీతా విలియమ్స్, జాన్ మెక్‌బ్రైడ్ వంటి వ్యోమగాములను దగ్గరగా కలిసింది. 2012లో ఆమె మిగ్ 29 జెట్ శిక్షణ కూడా పొందింది. అయితే ఈ ఘనతలను మీడియా పెద్దగా హైలైట్ చేయలేదు. కానీ ఇటీవల ‘గుంజన్ సక్సేనా’ సినిమా వచ్చిన తర్వాత ఆయేషా గురించి ప్రపంచానికి తెలిసింది.