పిడిలైట్ త్రైమాసిక లాభం రూ. రూ.157 కోట్లు!

by Harish |
పిడిలైట్ త్రైమాసిక లాభం రూ. రూ.157 కోట్లు!
X

ముంబయి: ప్రముఖ గ్లూ కంపెనీ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికరలాభం 33.92 శాతం క్షీణతతో రూ.156.51 కోట్లను నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి కంపెనీ నికరలాభం రూ.236.87 కోట్లుగా ఉందని పేర్కొంది. నాలుగో త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.1639.28 కోట్ల నుంచి రూ.1544.68 కోట్లకు పరిమితమైనట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.928.39కోట్ల నుంచి రూ.1122.05కోట్లకు పెరిగింది. ముడి సరుకుల వ్యయం 42.1శాతానికి తగ్గింది. కరోనా వల్ల చివరి త్రైమాసికంలో ఆశించిన స్థాయి విక్రయాలు నమోదు చేయలేకపోయినట్టు కంపెనీ వివరించింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల సరఫరా వ్యవస్థలో అంతరాయం వల్ల త్రైమాసిక ఫలితాలు నిరాశజనకంగా ఉన్నట్టు పిడిలైట్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed