- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా వ్యాక్సిన్ పేరుతో ఫోన్ హ్యాక్..!
by Sumithra |

X
దిశ, పాలేరు: రోజుకో కొత్త రకం మోసాలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా కరోనా టీకా పేరుతో సైబర్ మోసానికి పాల్పడి ఫోన్ హ్యాక్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలానికి చెందిన ఓ వ్యక్తికి +912250041117 నుండి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీరు టీకాలు వేయించుకున్నట్లయితే 1 నొక్కండి’ అని కోరడంతో ఆ నెంబర్ ఎంటర్ చేయగానే డిస్‌ప్లేలో 1వ నెంబర్ రెడ్ కలర్‌లోకి మారి ఫోన్ హ్యాక్ అయిందని వాపోయారు. ఈ విషయంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..సైబర్ క్రిమినల్స్ ఈ పని చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఇక మీదట అటువంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని.. ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story