ఆన్‌లైన్ ఫార్మా సంస్థ మెడ్‌లైఫ్‌ను సొంత చేసుకున్న ఫార్మ్ఈజీ

by Harish |
ఆన్‌లైన్ ఫార్మా సంస్థ మెడ్‌లైఫ్‌ను సొంత చేసుకున్న ఫార్మ్ఈజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫార్మా కంపెనీ ఫార్మ్ఈజీ మరో ఆన్‌లైన్ ఫార్మా కంపెనీ మెడ్‌లైఫ్‌ను కొనుగోలు చేసినట్టు మంగళవారం ప్రకటించింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ఫార్మసీ రంగంలో ఇది అతిపెద్ద ఒప్పందం. ఇప్పటికే ప్రముఖ కంపెనీలైన రిలయన్స్ రిటైల్, అమెజాన్, టాటా సన్స్ ఆన్‌లైన్ ఫార్మా రంగంలో పోటీ పడుతున్నాయి. ‘ఈ కొనుగోలుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద హెల్త్‌కేర్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌గా మారనున్నాం. ప్రతి నెలా 20 లక్షల కుటుంబాలకు సేవలను అందిస్తామని’ ఫార్మ్ఈజీ సహ-వ్యవస్థాపకుడు ధవల్ షా చెప్పారు. మెడ్‌లైఫ్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేస్తుందని, మంగళవారం నుంచే తమ ఫార్మా సంస్థలో మెడ్‌లైఫ్ విలీనం అవుతుందని ఆయన తెలిపారు. మెడ్‌లైఫ్‌కు చెందిన వినియోగదారులు, రిటైల్ భాగస్వాములు ఫార్మ్ఈజీ ప్లాట్‌ఫామ్‌తో జత కలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఒకే వేదికపై వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఈ విలీనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఒప్పందం అనంతరం మెడ్‌లైఫ్ వాటాదారులకు ఫార్మ్ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌లో 19.59 శాతం వాటా దక్కుతుంది. దీని విలువ సుమారు రూ. 1,750 కోట్లు ఉంటుంది.

Advertisement

Next Story