రేపటి నుంచి వైద్య కోర్సుల పరీక్షలు

by Shyam |
రేపటి నుంచి వైద్య కోర్సుల పరీక్షలు
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో అనేక కోర్సుల పరీక్షలు వాయిదా పడుతున్నా..రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం మాత్రం యధావిధిగా మెడికల్ పీజీ, డిప్లామా కోర్సుల పరీక్షలను శనివారం నుంచి యధావిధిగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గాంధీ వైద్య కళాశాలలోని విద్యార్థులకు మాత్రం పరీక్షా కేంద్రాన్ని ఎల్బీనగర్‌లోని కిమ్స్ (కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు మార్చినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ వైద్య కళాశాల ఆవరణలోనే ఆస్పత్రి కూడా ఉండటం, దానిని కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులకు తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కిమ్స్‌కు తరలించినట్లు వివరణ ఇచ్చారు.

విశ్వవిద్యాలయం షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీల వివరాలు :

– ఈ నెల 20, 22, 24 తేదీల్లో పీజీ డిప్లొమా పరీక్షలు
– ఈ నెల 20, 22, 24, 26వ తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు
– పరీక్షా సమయం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు
– అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు రిపోర్ట్ చేయాలి
– రాష్ట్రం మొత్తం మీద మొత్తం 13 పరీక్షా కేంద్రాలు
– 994 మంది మెడికల్ పీజీ అభ్యర్థులు
– 193 మంది పీజీ డిప్లొమా అభ్యర్థులు
– మొత్తం 1,187 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు
– అన్ని పరీక్షా కేంద్రాల్లో కొవిడ్-19 నిబంధనల అమలు
– పెద్ద లెక్చర్ హాల్స్, ఎగ్జాం హాల్స్‌లో 25 నుంచి 30 మంది విద్యార్థులకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు
– అన్ని పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటిస్తూ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు
– కోవిడ్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు. యూజీసీ, యంసీఐ, ప్రభుత్వ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణ

Advertisement

Next Story