- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్ మంట తగ్గేనా.. ?
దిశ, వెబ్‌డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. అసలే కరోనా మూలంగా చేతినిండా పనిలేక కుటుంబాన్ని పోషించడమే భారంగా మారిపోయిన సమయంలో పెరిగిన ధరలు ఆందోళనకు గురి చేస్తుంది. ఇక దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 9 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.56 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.62 కు చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 106.25 చేరగా.. డీజిల్ ధర రూ. 97.18 కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గురువారం మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.14 , ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 97.68గా ఉంది. అలాగే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.37 గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 97.17గా ఉంది.