చమురు మంట.. మళ్లనంట!?

by Harish |   ( Updated:2020-03-01 07:42:35.0  )
చమురు మంట.. మళ్లనంట!?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏప్రిల్ 1 నుంచి కొత్తగా రానున్న ఉద్గార నిబంధనలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు మండనున్నాయనే అనుమానాలకు సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు 70 పైసల నుంచి 120 పైసలు పెంచేందుకు కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో తక్కువ ఉద్గారాలు కలిగిన బీఎస్-6 ఇంధనాలను సరఫరా చేయబోతున్నామని, ఈ పరిణామాలతో రిటైల్ ధరలలో కొంత పెరుగుదల ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వ్యాఖ్యలు ధరల పెరుగుదలను సూచిస్తున్నాయి.

అతిపెద్ద చమురు సరఫరా సంస్థ ఐవోసీ..కొన్ని ప్రదేశాలను మినహాయించి కొత్తగా అమలుకానున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగానే ఇంధన సరఫరా ఉంటుందని వెల్లడించింది. ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ మోతాదులో సల్ఫర్ కలిగిన డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి జరిగేలా అప్‌గ్రేడ్ చేశామని, దానికోసం రూ. 17,000 కోట్లకు మించి ఖర్చు చేశామని సంస్థ ఛైర్మన్ సంజీవ్ వివరించారు. ధరలు పెరుగుతాయనే సూచనలిచ్చినప్పటికీ, ఎంత పెరుగుతాయనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఒకవేళ ధరలు పెరిగితే అవి వినియోగదారులపై భారం కాబోదని సంజీవ్ హామీ ఇచ్చారు.

చమురు శుద్ధి కర్మాగారాల అప్‌గ్రేడ్ కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సుమారు రూ. 35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో ఐవోసీ రూ. 17,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఇక బీపీసీఎల్ రూ. 7,000 పెట్టుబడి పెట్టింది. హెచ్‌పీసీఎల్ మాత్రం ఫిబ్రవరి చివరి వారం నుంచే బీఎస్-6 ఇంధనాలతో సిద్ధంగా ఉన్నామని, మార్చి 1 నుంచే కొత్త ఇంధనాలను విక్రయించనున్నట్టు హెచ్‌పీసీఎల్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed