యూపీ CMO ఎదుట నిప్పంటించుకున్న వ్యక్తి..

by Sumithra |   ( Updated:2023-03-20 20:09:04.0  )
యూపీ CMO ఎదుట నిప్పంటించుకున్న వ్యక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. ముఖ్యమంత్రి యోగి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి(36) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ల్యాండ్ విషయంలో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈ ఘటనలో కన్నూజ్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 30 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, భూమి విషయంలో తొలుత గ్రామంలోని పెద్దను కలిసిన బాధితుడు, ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసర్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకున్నట్లు తేలింది. వారు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన ఆ వ్యక్తి ఈ చర్యకు ఒడిగడినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed