నారాయణపేటలో దారుణం.. పాతకక్షలతో యువకుడి హత్య

by Sumithra |
నారాయణపేటలో దారుణం..  పాతకక్షలతో యువకుడి హత్య
X

దిశ, మహబూబ్‎నగర్: పాత కక్షలతో యువకుడిని హత్య చేసిన సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపులలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం పసుపుల గ్రామానికి చెందిన ఆంజనేయులు లాక్‌డౌన్ నేపథ్యంలో బుధవారం ఇంటి వద్ద ఉన్నాడు. అయితే, అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతడిపై కట్టెలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags: Person killed, Mob attack, pasupula, narayanpet

Advertisement

Next Story