కొత్త పుంతలు తొక్కిన శృంగారం.. ఊపిరాడక వ్యక్తి మృతి

by Anukaran |   ( Updated:2021-01-09 07:51:43.0  )
కొత్త పుంతలు తొక్కిన శృంగారం.. ఊపిరాడక వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నేటి తరం మనుషులు తాము ఏదీ చేసిన అందులో కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ జంట శృంగారం సమయంలో అవలంభించిన విధానం చివరకు వ్యక్తి ప్రాణాలు తీసింది. బూతు సినిమాల ప్రభావం, పోర్న్ సైట్స్ ఎఫెక్ట్ పుణ్యమా అని సెక్స్ సమయంలో వింత అనుభూతిని పొందేందుకు కొందరు తాళ్లతో బంధించుకుని మరి చేస్తున్నారు. అది కాస్త మితీమిరడంతో ప్రాణాల మీదకు వస్తోంది.

నాగపూర్‌లో జరిగిన తాజా ఘటన అందుకు ఉదాహరణగా నిలిచింది. ఇదివరకే పెళ్లయి సంతానం కలిగిన మహిళ ఓ వ్యక్తితో ఐదేళ్ల నుంచి రిలేషన్ కంటిన్యూ చేస్తోంది. వీరిద్దరూ లాడ్జ్‌లో రూమ్ తీసుకున్నారు. శృంగారం సమయంలో ఆ మహిళ అతన్ని తాళ్లతో కుర్చీకి బిగుతుగా కట్టేసింది. అనుకోకుండా కుర్చీ జారీ కింద పడిపోవడంతో ఆ తాడు అతని మెడకు గట్టిగా బిగుసుకుంది. దీంతో ఊపిరాడక ఆ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story