- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన తోడికోడళ్ల ఫోన్ పంచాయితీ..!
దిశ, పాలేరు : మొబైల్ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామానికి చెందిన కొలికపోంగు రవికిరణ్, రవితేజలు అన్నదమ్ములు. ఇటీవల రవికిరణ్ భార్య స్వర్ణకుమారి మొబైల్ పోయింది. తోటి కోడలు శ్రీలత తీసిందని అనుమానించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ వివాదం కాస్త తారాస్థాయికి చేరడంతో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన పంచాయితీని పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు శ్రీలత తండ్రి ఆచార్ల గూడెంనకు చెందిన జిల్లపల్లి గోవింద్(57)అలియాస్ వెంకటేశ్వర్లును పిలిపించారు. అదే విధంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం గ్రామానికి చెందిన స్వర్ణకుమారి తల్లితండ్రులు, బంధువులను కూడా మంగళవారం పంచాయితీకి పిలిపించారు.
పంచాయితీలో మాటా మాటా పెరిగి గోవింద్‌పై స్వర్ణకుమారి తల్లి జయమ్మ, తండ్రి బాబు, తమ్ముడు నరేందర్, పెద్దమ్మ కొడుకు నవీన్‌లు దాడి చేశారు. ఈ క్రమంలోనే అతన్ని బలంగా కొట్టడంతో సీసీ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయమైంది, అపస్మారకస్థితిలోకి వెళ్లిన గోవింద్‌ను హుటాహుటిన వైద్యం కోసం నేలకొండపల్లి హస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని వివరించాడు. సమాచారం అందుకున్నకూసుమంచి సీఐ సతీష్ కుమార్, ఎస్సై ఆశోక్ కున్నారు రెడ్డి, ట్రైనీ ఎస్సై కుశకుమార్‌లు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తమ్ముడు జిల్లపల్లి పాండు రంగయ్య తన అన్నను కావాలనే కొట్టి చంపారని ఐదుగురుపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.