ప్రియురాలి నిర్లక్ష్యం..తట్టుకోలేక యువకుడి మృతి

by Sumithra |
ప్రియురాలి నిర్లక్ష్యం..తట్టుకోలేక యువకుడి మృతి
X

దిశ, నిజామాబాద్:
ప్రేమించిన యువతి తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మంగళవారం ఉమ్మడి నిజామామాద్ జిల్లా కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లికి చెందిన సంతోష్(23) గత కొంత కాలంగా తల్లితో కలిసి అశోక్ నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. సంతోష్ వృత్తిరీత్యా డ్రైవర్. అయితే, గత కొద్ది రోజులుగా తన ఇంటికి దగ్గరలో ఉండే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ఆమెకు తెలియపరచగా ఇతన్ని నిర్లక్ష్యం చేసింది. దీంతో మనస్థాపం చెందిన సంతోష్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed