నా బాడీ అతనికే సొంతం.. తనే తాకాలని కోరుకుంటున్నా : అందాల నటి

by Shyam |   ( Updated:2021-12-04 06:30:10.0  )
Alexandra Daddario
X

దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ అలెగ్జాండ్రా దద్దారియో.. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ ఫారమ్‌ను మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ‘పెర్సీ జాక్సన్’ సిరీస్‌లో అన్నాబెత్ చేజ్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 35ఏళ్ల నటి.. గతంలో చాలామందితో డేటింగ్ చేసినట్లు రూమర్స్ రాగా తాజాగా ఆండ్రూ ఫారమ్‌తో ఎంగేజ్ మెంట్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆండ్రూ‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో అడుగుపెట్టిన అద్భుతమైన వ్యక్తి. చాలా నిజాయితీ పరుడు. ఆయనది సున్నితమైన మనస్తత్వం. నేను కష్టాల్లో ఉన్నప్నుడు నాకు బాసటగా నిలిచాడు.

నా మనసు ఇపుడు ప్రశాంతంగా ఉంది’ అని రాసుకొచ్చింది. అలాగే ఇటీవల ఈ జంట కాలిఫోర్నియాలోని ది వైట్ లోటస్ ప్రీమియర్‌లో సందడి చేసిన పిక్స్‌ను షేర్ చేసిన అలెగ్జాండ్రా.. ‘నా శరీరాన్ని తాకాలని నేను కోరుకునే వ్యక్తి ఆండ్రూ ఫారమ్’ అని ట్యాగ్ చేయడం విశేషం. ఇక గతంలో అలెగ్జాండ్రా.. జోర్డానా బ్రూస్టర్‌‌ను వివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2020లో విడాకులు తీసుకున్న నటి మళ్లీ 52 ఏళ్ల ఆండ్రూ ఫారమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది.

360°లో అందాలను చూపించిన నటి.. నెటిజన్లు ఫైర్

Advertisement

Next Story