భారీగా తగ్గిన పెప్సికో అమ్మకాలు

by Harish |
భారీగా తగ్గిన పెప్సికో అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 సంక్షోభం తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో పెప్సికో పానీయాలు(బెవరెజెస్) అమ్మకాలు రెట్టింపు స్థాయిలో తగ్గినట్టు కంపెనీ వెల్లడించింది. జూన్ 13తో ముగిసిన 12 వారాల కాలంలో స్మాక్స్ అమ్మకాలు సైతం గతేడాదితో పోలిస్తే రెండంకెల స్థాయి క్షీణించినట్టు ప్రకటించింది. దక్షిణాసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో పెప్సికో పానీయాల అమ్మకాలు 25 శాతం తగ్గినట్టు కంపెనీ వెల్లడించింది.భారత్, పాకిస్తాన్ దేశాల్లో రెండంకెలు తగ్గిపోగా, మిడిల్ ఈస్ట్, నైజిరియాల్లో అమ్మకాలు సింగిల్ డిజిట్ క్షీణత నమోదుచేసినట్టు పెప్సికో పేర్కొంది. కంపెనీ పనితీరుపై వ్యాఖ్యానించిన పెప్సికో ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రామోన్ ఎల్ లాగ్వార్టా..’ కొవిడ్-19 సంక్షోభం కారణంగా గణనీయమైన సవాళ్లను, సంక్లిష్టతను ఎదుర్కొంటున్నప్పటికీ, తమ వ్యాపారం ఈ త్రైమాసికంలో సానుకూల స్థాయిలోనే ఉంది’ అని వివరించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి సంకోచించడం, పరిమితులు, లాక్‌డౌన్ ఆంక్షలు, వినియోగదారుల విశ్వాసం క్షీణించడంతో పాటు వాటి ప్రభావం తమ వ్యాపార పనితీరుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయని, ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు రామోన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed