- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికెన్, మటన్‌పై లుక్కు.. సోషల్ డిస్టెన్స్‌కేదీ దిక్కు !
దిశ, మెదక్: కరోనా ఎఫెక్ట్‌తో వారం రోజులుగా సుక్క, ముక్క లేక నోరు చప్పబడిపోయిన జనాలు ఇవాళ్టి నుంచి చికెన్, మటన్‌పై లుక్కేశారు. చికెన్ తింటే కరోనా రాదు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో ఒక్కసారిగా షాపులకు క్యూ కడుతున్నారు. ఇక ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు అమాంతం ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నారు. దీంతో అవాక్కైపోతున్న నాన్‌వెజ్ ప్రియులు అయినా పర్లేదంటూ షాపుల ముందు బారులు తీరుతున్నారు.
మొన్నటివరకు చాలా ప్రాంతాల్లో కోళ్లను ఫ్రీగా పంచిన వ్యాపారులు, షాపుల్లో రూ.50కి రెండు కిలోల చొప్పున అమ్మకాలు జరిపారు. కానీ వీటన్నింటికి చెక్‌పెడుతూ ఫౌల్ట్రీ రంగానికి ఊపు తెచ్చేలా మొన్న కేసీఆర్ ప్రకటన చేయడంతో వ్యాపారులు రూ.200కు కిలో చికెన్‌ను విక్రయిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్నటివరకు మాములుగా జరిగిన మటన్ అమ్మకాలు సైతం భారీగా పెరిగడంతో రూ.750 వరకు అమ్ముతున్నారు. ఇవాళ ఆదివారం కావటంతో నాన్వేజ్ మార్కెట్లు భారీగా జనాలతో కిక్కిరిసిపోయాయి.
పాటించని సోషల్ డిస్టెన్స్
కరోనా వైరస్ నివారణ చర్యల దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన సోషల్ డిస్టెన్స్ నియామాన్ని ఎవరూ పాటించటం లేదు. నాన్వేజ్ మార్కెట్లలో జనాలు కిక్కిరిసిపోయారు. కనీసం డిస్టెన్స్‌ను మెయింటేన్ చేయకుండా ఎగబడి కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. వీరిని నియంత్రణ చేసేందుకు పోలీస్ అధికారులు సైతం అటువైపునకు వెళ్లకపోవడం గమనార్హం.
Tags : non veg, non veg prices, corona effect, chicken prices, chicken slaes in medak, People who put aside social distance, make chicken purchases