- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సెషన్స్ జడ్జి సునీత
దిశ, మెదక్ : నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని, ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమ్రిత్ మహోత్సవ పేరిట వివిధ విభాగాల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా న్యాయ సేవలు ప్రతి గడపకు తెలపాలని ఉద్దేశంతో అవగాహన న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం కోర్టు మండల పరిధిలోని 10 మండలాలకు చెందిన ఏం.పి .ఓ.లు, పంచాయతీ కార్యదర్శులు, డి.ఎల్.పి లతో న్యాయ సేవల అవగాహనపై మాయా గార్డెన్ లో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా అవేర్ నెస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. .
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ప్రతి బీదవానికి న్యాయం అందించాలని రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందని, ఇది గ్రామా స్థాయి ప్రజలకు తెలియక న్యాయం పొందలేకపోతున్నారని భావించి సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికార సంస్థ ద్వారా అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, న్యాయవాదులు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, డి.ఎల్.పి .ఓ.లు సుధాకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, వరలక్ష్మి, ఏం.పి .ఓ.లు, గ్రామా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.