- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NO వ్యాక్సిన్.. నో ‘రేషన్’.. టీకా కోసం క్యూ కట్టిన ప్రజలు
by Shyam |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషన్ ఇవ్వరు. రేషన్ తీసుకోకుంటే ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు కారు అంటూ.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో జోరుగా పుకార్లు షికార్లు చేశాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు వ్యాక్సిన్ వేసుకోడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలి వచ్చారు. నవీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉదయం నుంచి ప్రజలు క్యూ కట్టారు.
ఈ క్రమంలో వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉన్న డోసులతో సోమవారం 500 మందికి మొదటి డోస్ వేశారు. మరో 10 మందికి సెకండ్ డోస్ టీకా అందించారు. అయితే వ్యాక్సినేషన్ కోసం ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో టీకా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియ అని ప్రజలు పుకార్లను నమ్మవద్దని, వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు.
Advertisement
Next Story