- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ ప్లాన్ తెలిసి షాక్ అవుతున్న హుజురాబాద్ ప్రజలు.. అది నిజమేనా.?
దిశ, హుజురాబాద్ : రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజురాబాద్‌కు చెందిన బండ శ్రీనివాస్‌ను నియమిస్తూ మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పదవి కాలం మాత్రం ఏడాదేనని అందులో పేర్కొనడమే చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రెండేళ్ల పాటు నామినేటెడ్ పోస్టులో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ను ఏడాది కాలం వరకే అపాయింట్ చేయడం గమనార్హం.
ఇది ఎన్నికల కోసమేనా..?
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వరద పారిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దళిత బంధు కార్యక్రమం చేపట్టిన సర్కార్ హుజురాబాద్‌నే పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. అలాగే, రెండో విడుత గొర్రెల పంపిణీ కూడా హుజురాబాద్ వేదికగానే చేపట్టారు.
హుజురాబాద్‌లో అధికార పార్టీ బలాన్ని పెంచేందుకు సర్కార్ అన్ని రకాలుగా వేస్తున్న ఎత్తుల్లో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును కూడా హుజురాబాద్ వాసికి ఇచ్చిందన్న వాదనలకు బలం చేకూర్చే విధంగా ఏడాది కాలం వరకే ఈ పోస్టులో బండ శ్రీనివాస్‌ను నియమిస్తున్నట్టు పేర్కొనడం విచిత్రం. దీంతో, నామినేటెడ్ పోస్టుల ఎర కూడా ఎన్నికల కోసమేనా అన్న చర్చ హుజురాబాద్ వ్యాప్తంగా సాగుతోంది.