- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు భారీ షాక్.. ఈటల మా దేవుడంటూ పాదాలకు పాలాభిషేకం..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రస్తుతం హుజురాబాద్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రభుత్వం హుజురాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో 11వ రోజు సంచలన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈటల అభిమానులు తమ అభిమానాన్ని చూపించారు. ఈటల రాజేందర్ రాజీనామాతోనే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ఈటల రాజేందర్ పాదాలను పాలతో కడిగారు విలాసాగర్ గ్రామస్తులు. ఈ రకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, నియోజకవర్గ ప్రజల కోసం ప్రభుత్వం పలు పథకాలను రచిస్తుంటే.. ప్రజలు మాత్రం ఈటలను సపోర్టు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో హీట్‌ను పెంచుతోంది.