- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీష్‌రావు సీరియస్ యాక్షన్ ప్లాన్.. అతి త్వరలో..
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే జిల్లా వైద్యాధికారుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సర్కార్, పర్మినెంట్విధానంలో డీఎంహెచ్ఓలను నియమించలేదు. ప్రస్తుతం కేవలం ఉమ్మడి జిల్లాల వారీగా శాశ్వత విధానంలో డీఎంహెచ్ఓలు పనిచేస్తున్నారు. మిగతా జిల్లాల్లో టెంపరరీ అధికారులు కొనసాగుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా రెగ్యులర్విధానం భర్తీ వైపు సర్కార్ మొగ్గు చూపడం లేదు. కొత్త జిల్లాల్లో పూర్తి స్థాయి డీఎంహెచ్ఓలను నియమించాలని గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్కొంతవరకు ప్రయత్నించారు. పూర్తి స్థాయి ఫైల్రెడీ అయ్యేలోపే ఆయన మంత్రి పదవి ఊడిపోయింది. ఆ తర్వాత కొంతకాలం వైద్యశాఖ ఏకంగా సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నది. అయితే శరవేగంగా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పటికీ, జిల్లా వైద్యాధికారుల నియామకాలు మాత్రం జరగలేదు. అన్ని జిల్లాల్లో రెగ్యులర్ విధానంలో డీఎంహెచ్ఓలను నియమించాలని ప్రభుత్వం వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. కానీ,.. సర్కార్ నుంచి స్పందన రాలేదని సర్కార్ డాక్టర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావును ప్రత్యేకంగా కలసి ప్రభుత్వ వైద్యుల సంఘం వివరించింది. దీంతో పాటు వైద్యారోగ్యశాఖలోని మరిన్ని సమస్యలను ముందుకు తీసుకువచ్చింది. ఆరోగ్యశాఖలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్సానుకూలంగా ఉన్నదంటూ మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. అంతేగాక అతి త్వరలో డాక్టర్లు, మెడికల్జేఏసీలతో ప్రత్యేక మీటింగ్‌ను నిర్వహిస్తానని మంత్రి చెప్పినట్లు ప్రభుత్వ వైద్యులు ‘దిశ’కు తెలిపారు.
అస్తవ్యస్తంగా ఆసుపత్రులు..
పర్మినెంట్ వైద్యాధికారులు లేకపోవడంతో ఆయా జిల్లాల్లో వైద్యసమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యఅధికారులు పర్యవేక్షణ లేక క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. పీహెచ్ సీల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యసేవలకు ఆటంకం కలుతున్నది. డాక్టర్లు, ఆసుపత్రుల అధికారులతో రివ్యూలు నిర్వహించేవారు లేక సేవలు మందగిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రుల నుంచి ఆశీంచిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. అంతేగాక క్రింది స్థాయి సిబ్బందిలోనూ నిర్లక్ష్యం పెరిగింది. ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లను సరిగ్గా పట్టించుకోవడం లేదు. తాత్కాలికంగా ఇన్ చార్జ్ డీఎంహెచ్‌ఓలుగా ఉన్నా, వారు వైద్యవ్యవస్థ బలోపేతం కొరకు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రౌండ్లెవల్ లో విజయవంతంగా తీసుకువెళ్లడం లేదు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో మంచి వైద్యం అందడం లేదని చాలా మంది హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు.
పది మందే ఉన్నారు: డా. పుట్ల శ్రీనివాస్(ప్రభుత్వ వైద్యుల సంఘం)
కొత్త జిల్లాల వారీగా పర్మినెంట్డీఎంహెచ్ఓలు లేక గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలు వారీగా పది మందే పర్మినెంట్విధానంలో పనిచేస్తున్నారు. తాత్కాలిక అధికారులు పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. సమీక్షలు, తనిఖీలు లేనందున పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆసుపత్రుల్లో కొందరి సిబ్బంది, డాక్టర్లలో నిర్లక్ష్యం పెరిగింది. దీంతో పేషెంట్ కుసకాలంలో వైద్యం అందడం లేదు. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు చాలా సీరియస్యాక్షన్ప్లాన్ను తయారు చేస్తున్నారు. అతి త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశీస్తున్నాను.