- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శాసన సభ్యులకు లేని ఆ పన్ను.. మాపై మాత్రం ఎందుకు.. ?
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పెన్షనర్ల సంఘం దేశంలోని సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించేలా ఆదాయ పన్ను నుంచి పెన్షనర్లను మినహాయించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పార్లమెంట్ సభ్యులతో పాటు, శాసన సభ్యులు అందుకునే పెన్షన్లకు లేని పన్ను, రిటైర్డ్ ఉద్యోగులకు ఎందుకు విధిస్తున్నారని సంఘం లేఖలో పేర్కొంది. ‘ప్రతి రిటైర్డ్ ఉద్యోగీ అనేక సంవత్సరాలు దేశానికి సేవ చేసినందువల్లే జీవనోపాధి కోసం రిటైర్‌మెంట్ ఫండ్‌గా పెన్షన్‌ను చెల్లిస్తున్నారని’ లేఖలో వివరించారు. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు అందుకునే పెన్షన్‌పై ఆదాయంపై పన్ను ఎందుకు విధిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోందని, ఇది సేవ చేయడం ద్వారానో, పని వల్లనో వచ్చిన ఆదాయం కాదు. ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్‌లకు పన్ను మినహాయింపు ఉన్నప్పుడు, తమను మాత్రం పన్ను పరిధిలోకి ఎందుకు ఉంచారని’ పెన్షనర్ల సంఘం లేఖలో స్పష్టం చేసింది.
ఇది వరకు 2018లో జరిగిన అఖిల భారత సదస్సులో పెన్షన్‌లపై ఆదాయపు పన్నును మినహాయించాలని ఈ సంఘం తీర్మానం చేసింది. అప్పటినుంచే ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. దీర్ఘకాలంగా ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏమీ చేయలేకపోవడంపై చింతిస్తున్నాం. దీనిపై జోక్యం చేసుకోవాలని, పెన్షనర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకునేలా మంత్రిత్వ శాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానిని పెన్షన్ సంఘం అభ్యర్థించింది. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగికి విలువైన హక్కు అని, పెన్షన్ పొందే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ప్రకారం ఆస్తిగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న ఆదేశాన్ని సంఘం లేఖలో వెల్లడించింది.