- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషాంగంతో ఏ భాగాన్ని తాకినా లైంగికదాడితో సమానమే..
తిరువనంతపురం : లైంగికదాడి కేసులో కేరళ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. బాధితురాలి శరీరంలోని ఏ భాగంలోనైనా పురుషాంగాన్ని తాకిస్తే అది లైంగికదాడిగానే భావించాలని, అందుకు భారత శిక్షాసృతి ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించాల్సిందేనని, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బాధితురాలి తొడలకు మాత్రమే తన పురుషాంగం తగిలిందని నిందితుడు వాదించటంతో కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.
బాధితురాలి శరీరంలోని ఏ భాగాన్నైనా రంధ్రంగా భావించి అంగప్రవేశం చేస్తే దాన్ని అత్యాచారంగానే పరిగణించాలని వెల్లడించింది. పురుషాంగం ఎక్కడ తాకినా అది నిందితుడికి లైంగిక సంతృప్తిని అందించిందని జస్టిస్ కె వినోద్, జస్టిస్ జియాద్ రహమాన్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా అత్యాచారమేనని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
నిందితుడి తరుఫున వాదించిన న్యాయవాది, సెక్షన్ 375 ప్రకారం కేసులు నమోదు చేశారని, అంగప్రవేశం జరిగితేనే ఇలాంటి కేసులు పెట్టాలని అన్నారు. భారత శిక్షాస్మృతిలో అత్యాచారానికి ప్రత్యేక నిర్వచనం ఉందని న్యాయవాది చెప్పిన విషయాలను కోర్టు తోసిపుచ్చింది. యోని, మూత్రనాళం, పాయువు, నోరు వంటి వాటినే కాకుండా ఇతర భాగాలపై కూడా పురుషాంగంతో ఎలాంటి దాడి చేసినా అది లైంగికదాడిగానే పరిగణించాలని సెక్షన్ 375(సి) చదివితే తెలుస్తుందని న్యాయవాదికి చురకలు అంటించింది. దీనిపై కోర్టుకు విశేష అధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.
కోర్టులో వాదనలు..
ఆరు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయటంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ నిందితుడు కేరళ హైకోర్టులో అప్పీల్ చేశాడు. తను ఎలాంటి లైంగికదాడి చేయలేదని తనపై నమోదు చేసిన రేప్ కేస్‌ను కొట్టివేయాలని కోరాడు. తన పురుషాంగం కేవలం తొడలకు మాత్రమే తగిలిందని తెలిపాడు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. భాధితురాలికి అనేక సార్లు నీలిచిత్రాలు చూపించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, ఆమె జననేంద్రియాలను తరచూ తాకడానికి ప్రయత్నించేవాడని కోర్టుకు విన్నవించారు.
పైగా ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించేవాడని అన్నారు. దీనిపై కోర్టు స్పందించింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదని వ్యాఖ్యానించింది. అయితే ఐపీసీ సెక్షన్ 376 (1),సెక్షన్ 375 (సి) అప్పీలుదారు చేసినవి లైంగిక చర్యలుగా నిర్ధారించబడ్డాయని కోర్టు పేర్కొంది. సెక్షన్లు 354 (అత్యాచారం), సెక్షన్ 354 ఎ (1) (i) కింద నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుడికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదును కూడా యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.