పెద్దగట్టు జాతర ప్రారంభం.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు

by Shyam |
పెద్దగట్టు జాతర ప్రారంభం.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ,వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర ప్రారంభం అయింది. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. రెండేళ్ల కోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా పెద్దగట్టుకు గుర్తింపు ఉంది. దేవర పెట్టే దురాజ్ పల్లికి రావడంతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. జాతర సందర్బంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు.

Advertisement

Next Story