- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భారీ షాక్..
దిశ, మహబూబ్ నగర్ : ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని మహబూబ్ నగర్‌లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటిని PDSU-PYL ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. TRS ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు వేయకుండా హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు కల్ల బొల్లి మాటలతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నదని పీడీయస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి సీతారాం ఆరోపించారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా లక్షా 91 వేలు ఉన్నాయని, వీటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. జిల్లా మండలం, యూనివర్సిటీ కళాశాలలు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు.
ప్రభుత్వం ఉచితంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగుల నుంచి ఎటువంటి అప్లికేషన్ ఫీజు వసూలు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా అవకాశం కల్పించాలని, పోటీ పరీక్షలలో నిరుద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై ప్రత్యేకంగా చర్చించి పరిష్కారం చేయాలన్నారు.
నిరుద్యోగులకు ప్రభుత్వ హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU నారాయణపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి కుమార్, అజయ్, PDSU జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి సీతారాం, PDSU నాయకులు తదితరులు పాల్గొన్నారు.