- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేదు
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ఫైర్ అయ్యారు. నేతలు ప్రజాసంక్షేమాన్ని వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇస్తుంటే రాజకీయ ఉద్దేశ్యంతో చూస్తూ, అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. కరోనా విషయంలో హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పద్ధతి మార్చుకోకుండా ప్రజలను మభ్య పెడుతోందని మండిపడ్డారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కరోనా విషయంలో అబద్దాలు చెప్పారని అన్నారు. కరోనా అసలు తెలంగాణకు రాదని, పారసీటమల్ గోలి వేసుకుంటే పోతుందని అవగాహన లేకుండా, ఆశాస్త్రీయంగా మాట్లాడారని ఉత్తమ్ విమర్శించారు. కరోనాపై యుద్దం చేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో కనీసం పీపీఈ కిట్లు సరఫరా చేయలేదని, దేశంలోనే అతి తక్కువ టెస్టులు చేసి కేసుల సంఖ్య చెప్పకుండా దాస్తున్నారని ఆరోపించారు. 38మందికి సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోయారని హైకోర్టు ప్రశ్నించిందని, ఆక్సిజన్ సిలిండర్లు లేవని, పీపీఈ కిట్లు లేవని, సరిపోయో స్థాయిలో మాస్కులు కూడా లేవని, వెంటిలేటర్లు అందుబాటులో పెట్టలేదని దుయ్యబట్టారు. కరోనా మరణాల్లో తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సాహసం చేసి ఈఎస్ఐ శ్మశాన వాటికలో ఒకేరోజు రాత్రిపూట 60 శవాలు దహనం చేస్తున్న వీడియోలు, ఫోటోలు బయట పెట్టిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయన్నారు.