- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ దీవెనలతోనే ఈ స్థాయిలో ఉన్నా.. ఈ గడ్డను నేనెప్పటికీ మరిచిపోను: రేవంత్ రెడ్డి
దిశ, కొడంగల్: నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గిలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ మండల కేంద్రంలోని గాంధీనగర్ లో కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రసన్న లక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజల ఆదరాభిమానాలతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని.. ఎంత పెద్ద పదవి వచ్చినా కొడంగల్ ప్రజలను మరిచిపోను.. వారి దీవెనలు ఎప్పటికీ ఉండాలని.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు తనకు ఎంత పెద్ద పదివి వచ్చినా ఎంతదూరం పోయినా కొడంగల్ ని మరువనని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలను కన్నబిడ్డల వలే కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని, కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు శివసేనారెడ్డి, యువజన కాంగ్రెస్ కార్యదర్శి కృష్ణంరాజు, కొడంగల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, నందారం ప్రశాంత్ గుప్తా, కొడంగల్ నయీమ్, సోమ శేఖర్, రేవంత్ మిత్ర మండలి అధ్యక్షుడు దామోదర, రేవంత్ సైన్యం అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
- Tags
- kodangal