పాక్ ఆటగాళ్ల భద్రతకు బీసీసీఐ భరోసా ఇవ్వాలి: పీసీబీ

by Shyam |
పాక్ ఆటగాళ్ల భద్రతకు బీసీసీఐ భరోసా ఇవ్వాలి: పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్లలో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలంటే బీసీసీఐ లిఖిత పూర్వకంగా తమ ఆటగాళ్ల భద్రతకు భరోసా ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరింది. ఈ మేరకు ఐసీసీకి పీసీబీ లేఖ రాసినట్లు సీఈవో వసీమ్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం నుంచి త్వరలో హమీ కావాలి అని, దీనికి బీసీసీఐని ఐసీసీ సంప్రదించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతానికైతే 2020, 2021 టీ20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందనే విషయంలో మార్పు లేదు కాబట్టే ఐసీసీకి ఈ లేఖ రాశామని ఆయన అన్నారు. ఒకవేళ ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వచ్చే ఏడాదికి వాయిదా పడినా ఇండియాలో అయితే రెండు వరల్డ్ కప్స్ జరిగే అవకాశం ఉంది. వాటిలో పాక్ ఆటగాళ్లు పాల్గొనాలంటే మాకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంపై స్పందించడానికి బీసీసీఐ నిరాకరించింది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఈ విషయంలో ఐసీసీ మమ్మల్నిసంప్రదిస్తే అప్పుడు ఆలోచిస్తామని ఒక బీసీసీఐ అధికారి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed