- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో కీలక పోరు.. ఆర్సీబీపై క్రిస్ గేల్ ఆడుతాడా..?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో నేడు మరో కీలక పోరు మొదలుకానుంది. కోహ్లీ కెప్టెన్సీ వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టు 5 విజయాలతో దూసుకెళ్తోంది.. సీఎస్కేతో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే పరాజయం పొంది..10 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతుంది.
పంజాబ్ మాత్రం ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో నాలుగు పాయింట్లతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఆర్సీబీ గెలిస్తే టేబుల్ టాప్‌లోకి వెళ్తోంది. ఇక పంజాబ్ కేకేఆర్‌ను వెనక్కి నెట్టి ఒక స్థానానికి ఎగబాకనుంది. దీనికితోడు గతంలో ఆర్సీబీ జట్టులో సత్తాచాటిన క్రిస్ గేల్.. ప్రస్తుతం పంజాబ్‌లో ఉండటం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడో అని అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.