- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిరోజే నిరాశ పరిచిన పేటీఎమ్ లిస్టింగ్!.. కన్నీరు పెట్టిన కంపెనీ సీఈఓ..
దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఐపీఓ గురువారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయింది. భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో పేటీఎందే అతిపెద్ద ఐపీఓ కావడం విశేషం. కానీ, పేటీఎం స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన మొదటిరోజే ఇన్వెస్టర్ల ఆసక్తిని కోల్పోయింది. రూ. 18,300 కోట్ల భారీ ఐపీఓ లిస్టింగ్ నేపథ్యంలో పేటీఎమ్ ఫౌండర్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు.
‘జాతీయ గీతం ఎప్పుడు విన్నా సరే ‘భారత భాగ్య విధాత’ అనే మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇప్పుడు కూడా కన్నీళ్లు ఆగడంలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, పెటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ లిస్టింగ్ అయిన మొదటిరోజే డీలాపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిరోజే 9 శాతం వరకు పడిపోయి ట్రేడింగ్ ముగిసే సమయానికి 27.25 శాతం పతనమైంది. ఇష్యూ ధర రూ. 2,150 నుంచి రూ. 1,955 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి, ముగిసే నాటికి షేర్ విలువ రూ. 1,564 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీలో రూ. 1,950 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి రూ. 1,562 వద్ద స్థిరపడింది. పేటీఎం షేర్ విలువను అధికంగా చూపించడం, కంపెనీ ప్రమోటర్లలో 75 శాతం మది ఇతర దేశాలకు చెందిన వారు కావడం, వన్97 కమ్యూనికేషన్ సంస్థకు సరైన వ్యాపార నమూనా లేదనే విదేశీ బ్రోకరేజీ కంపెనీ వ్యాఖ్యలు, మార్కెట్లో పోటీ సంస్థగా మాత్రమే ఉండటం లాంటి ప్రతికూల అంశాల వల్లే కంపెనీ లిస్టింగ్ రోజే నీరసించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, ఆసక్తికరంగా కంపెనీ షేర్ విలువ బలహీనపడినప్పటికీ మార్కెట్ విలువ రూ. లక్ష కోట్లను అధిగమించడం విశేషం. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో రూ. 1.01 లక్షల కోట్లుగా ఉంది.