ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి పేటీఎం

by Shamantha N |
ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి పేటీఎం
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఇన్సూరెన్స్ బిజినెస్‌లో కొత్త ప్రారంభానికి పేటీఎం శ్రీకారం చుట్టబోతోంది. 35 కోట్ల మంది వినియోగదారులు గల పేటీఎం మొబైల్ వాలెట్‌కు ఇన్సూరెన్స్ అమ్మకాలు జరిపేందుకు లైసెన్స్ దొరికింది. ఈ లైసెన్స్ సాయంతో ఇన్సూరెన్స్ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తం నాలుగు రంగాల్లో బీమా అమ్ముకునే అవకాశం పేటీఎంకు లభించింది. టూ వీలర్ ఇన్సూరెన్స్, ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్, ఆరోగ్యం, జీవిత బీమాలను పేటీఎం అమ్ముకోవచ్చు. బీమా అమ్మకాల లైసెన్స్ కోసం పేటీఎం చాలా కష్టపడింది. దాదాపు 20 ఇన్సూరెన్స్ ప్రొవైడర్లతో పార్ట్‌నర్‌షిప్ పొంది కార్పోరేట్ ఏజెన్సీ లైసెన్స్ పొందింది. ఇప్పుడు ఇదే కార్పోరేట్ ఏజెన్సీ లైసెన్స్‌ని పణంగా పెట్టి ఇన్సూరెన్స్ అమ్మకాల లైసెన్స్ దక్కించుకుంది. అయితే పేటీఎం ద్వారా 1.6 కోట్ల పేటీఎం మర్చంట్లకు లాభం కలగబోతోంది. మర్చంట్ల ద్వారా ఇన్సూరెన్స్ అమ్మకాలు చేపట్టడం వల్ల వారికి కూడా కమిషన్ రూపంలో కొంత లాభం కలిగే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లైసెన్స్ రాకతో పాలసీ బజార్, ఈటీ మనీ వంటి కంపెనీలకు పేటీఎం గట్టిపోటీ ఇవ్వనుంది.

tags : Paytm, License, Merchants, Insurance, Business, Two wheeler, four wheeler, health,

Advertisement

Next Story