మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదలం: పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2021-01-23 00:20:39.0  )
Telangana Formation Day
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శనివారం ఒంగోలులో వెంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్.. రూ.8.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పిల్లలకు జీవితకాలం విద్యను అందించే బాధ్యతను తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రశ్నించినందుకు వెంగయ్యను చంపేశారని, ప్రాణాలు తిరిగిరావు, కడుపుకోతను తీర్చలేమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారాంబాబు చేసిన పనికి పసిపిల్లలకు తండ్రి లేకుండా పోయాడన్నారు. అన్నా రాంబాబు పతనం ప్రారంభమైందని, అథ: పాతాళానికి తొక్కుతామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story