'వీళ్లే నా గుండె చప్పుళ్లు' అంటూ వీడియో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్‌

by srinivas |   ( Updated:2021-10-05 09:00:12.0  )
fans
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పవన్‌కు ఉన్న అభిమానులు కూడా విపరీతంగా ఉంటారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు…ఆయన సభకు తరలి వెళ్లేందుకు ఎన్నోసాహసాలు చేస్తూ ఉంటారు. అది పవన్ ఫ్యాన్స్‌కే చెల్లింది. ఇటీవలే అలాంటి అభిమానం ప్రదర్శించారు అభిమానులు..జనసైనికులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హుకుంపేటలో పవన్ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొనేందుకు ఉభయగోదావరి జిల్లాల నుంచి అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. పోలీస్ ఆంక్షలు ఉన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి మరీ వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది జనసైనికులు మోకాలి లోతు నీళ్లలో నడుస్తూ మరీ సభకు హాజరయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వీడియోను షేర్ చేశారు. నా జన సైనికులు, నా గుండె చప్పుళ్లు అంటూ సగర్వంగా ప్రకటించారు. మీరు సమాజానికి సుస్థిరతను తెచ్చే యోధులు… మీకు నా కృతజ్ఞతలు, నేను మీకు రుణగ్రస్తుడిని అంటూ పవన్ కల్యాణ్ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed