- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభిమానులు లేకపోతే పవన్ కల్యాణ్ లేడు : పవర్ స్టార్
దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘దిల్ రాజుగారి లాంటి వ్యక్తితో.. వకీల్ సాబ్ వంటి చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వేణు శ్రీరామ్ అద్భుతమైన దర్శకుడు. ఇలాంటి ఒక చక్కటి దర్శకుడి దగ్గర నటించడం నా ఆనందంగా ఉంది. అక్కచెల్లెళ్లు, ఆడపడుచులు, అమ్మ, పెద్దమ్మలు.. అందరూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. వారందరికీ ఈ ‘వకీల్ సాబ్’ రూపంలో ఓ మూవీ చేసి..
వారి తరపున నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదేళ్లు దాటి పోయిందంటే నమ్మశక్యంగా లేదు. అభిమానులు లేకపోతే పవన్ కల్యాణ్ లేడని ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. తాను ఏమాత్రం అండదండలు లేని సమూహం నుంచి వచ్చిన వాడినని.. మీ గుండె చప్పుడు అర్థం చేసుకోగలను. మిమ్మల్ని గౌరవించి మీ ఆనందం కోసం పరితపించేవాడిని. ఒక్కోసారి మీకు తగ్గట్లుగా సినిమా చేయకపోవచ్చు.. కానీ ఎక్కువ సినిమాలు చేసి.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను.’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.