ఆ ‘పవర్’కు పెద్ద ఫ్యాన్!

by Shyam |   ( Updated:2020-03-01 07:44:50.0  )
ఆ ‘పవర్’కు పెద్ద ఫ్యాన్!
X

దిశ, వెబ్‌డెస్క్:

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో పవన్ కల్యాణ్‌కి పెద్ద ఫ్యాన్ అనే ప్రశ్నకు స్వయాన పవన్ కల్యాణ్‌కి బంధువు అయినటువంటి మరో ఫేమస్ హీరో సమాధానమిచ్చాడు. అలాగని తన పేరునే చెప్పాడని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

ఇటీవల ‘భీష్మ’ చిత్రం సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరగగా దానికి ముఖ్య అతిథిగా హీరో వరుణ్ తేజ్ హాజరయ్యారు. అక్కడ ఆయన హీరో నితిన్‌పై ప్రశంసలు కురిపించాడు. తన బాబాయ్ గా, బ్లడ్ రిలేషన్ ఉండటం వల్ల పవన్ కల్యాణ్ పై ప్రేమ ఉండటం సాధారణమేనని, అయితే పవన్ కల్యాణ్ కు పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నితినేనని తేల్చిచెప్పాడు. ఆ మాటలు విన్న అభిమానులు ఈలలతో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

కేవలం వరుణ్ మాత్రమే టాలీవుడ్ సినిమా గురించి సాధారణ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నకు నితిన్ అని సమాధానం చెబుతారు. ఎందుకంటే నితిన్ సినిమాల్లో కనీసం ఒక్క అంశంలోనైనా పవన్ కల్యాణ్ ప్రస్తావన ఉండేలా చూసుకుంటాడు. ఆయన మ్యానరిజం కానీ, స్టైల్ కానీ, పాట కానీ, మాట కానీ, పేరు కానీ, డైలాగ్ కానీ ఇలా ఏదో ఒకదాన్ని తన సినిమాల్లో పెట్టి నితిన్ తన అభిమానాన్ని చాటుకుంటాడన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story