కరోనా సోకిందని ఉరేసుకుని చెట్టుకు వేలాడి..

by Sridhar Babu |
కరోనా సోకిందని ఉరేసుకుని చెట్టుకు వేలాడి..
X

దిశ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావు పేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రోడ్డ నర్సయ్య (58) అనే వ్యక్తి గురువారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నరసయ్యకు వారం రోజుల కిందట కరోనా సోకడంతో సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందారు. గురువారం ఇంటికి వచ్చిన నరసయ్య కరోనా వ్యాధి న్యాయం అవుతుందా? కాదా అనే భయంతో మలకపేట రిజర్వాయర్ దగ్గర చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మృతునికి భార్య దేవవ్వ, కూతురు, కుమారుడు ఉన్నారు.

కరోనాతో ఇద్దరు మృతి..

కోనరావుపేట మండలంలో గురువారం కరోనా కాటుకు ఇద్దరు బలయ్యారు. నిమ్మపెళ్లి గ్రామానికి చెందిన నరసవ్వ(65), అదేవిధంగా వెంకటరావుపేటకు చెందిన రామస్వామి (52) వీరిద్దరూ కరోనాకు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.

Advertisement

Next Story