ఐసోలేషన్ వార్డు నుంచి పేషెంట్ పరార్

by Sridhar Babu |
ఐసోలేషన్ వార్డు నుంచి పేషెంట్ పరార్
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా పేషెంట్ పరారయ్యాడు. వేములవాడ మండలం చింతల్ ఠానా ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో పేషెంట్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణములోని సుందరయ్య నగర్‌లో అతన్ని సీఐ వెంకటనర్సయ్య ఆధ్వర్యంలోని పోలీసు టీం గుర్తించారు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉండడంతో వీరిద్దరినీ తిరిగి ఐసోలేషన్‌కు తరలించేందుకు అంబుల్లెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గంటకు పైగా పోలీసులు అంబులెన్స్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు వారిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

Advertisement

Next Story