మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే..!

by srinivas |
Municipal election
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 73 మున్సిపాలిటీలతో పాటు, మొత్తం 11 కార్పొరేషన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఫ్యాన్ గాలికి సైకిల్ టైర్ పంక్చర్ అయ్యింది. గ్లాస్ గల్లంతైంది. కమలం వాడిపోయింది. వామపక్ష పార్టీలు తమ ఉనికినే కోల్పోయాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదయిందనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో విడుదల చేసింది.

పార్టీల పరంగా నమోదైన ఓట్ల శాతం :
వైసీపీ – 52.63 శాతం
టీడీపీ – 30.73 శాతం
జనసేన – 4.67 శాతం
బీజేపీ – 2.41 శాతం
స్వతంత్రులు – 5.73 శాతం
నోటా – 1.07 శాతం

Advertisement

Next Story

Most Viewed