- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 15 నుంచి సుప్రీంలో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ప్రత్యక్ష విచారణను దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ హియరింగ్స్ చేపట్టడానికి నిర్ణయించింది. ఈ విధానంలో న్యాయవాదులు, కేసులోని ఇతరులు కోర్టులో భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో రెండు మార్గాల్లోనూ విచారణకు హాజరు అవడానికి అవకాశం ఉంటుంది.
దీనికోసం సుప్రీంకోర్టు మంగళ, బుధ, గురువారాలను ఎంచుకుంది. ఈ వారాల్లో కోర్టు విచారణ రెండు విధాలుగా నిర్వహించనుంది. మంగళ, బుధ, గురువారాల్లో షెడ్యూల్‌లోని తుది దశకు చేరిన, లేదా రెగ్యులర్ కేసుల విచారణ హైబ్రిడ్ మోడ్‌లో సాగుతుందని, అది కూడా కేసులోని వాద, ప్రతివాదులు, న్యాయవాదుల సంఖ్య, కోర్టు గది సామర్థ్యం, ఇతర పరిమితులను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం ఈ నిర్ణయం చేస్తుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. సోమ, శుక్రవారాల్లో యథావిధిగా వీడియో లేదా టెలీ కాన్ఫరెన్సింగ్ మోడ్‌లో విచారణ జరుగుతుందని వివరించింది.