మహేశ్వరంలో అవినీతి జలగలు.. రూ.7.5లక్షలు డిమాండ్!

by Sumithra |
మహేశ్వరంలో అవినీతి జలగలు.. రూ.7.5లక్షలు డిమాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో ఏదో మూల రోజుకు ఒక్క అధికారి అయిన ఏసీబీ అధికారులకు పట్టబడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా మహేశ్వరంలో ఏడున్నర లక్షలు డిమాండ్ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏసీబీకి పట్టుబడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఐదున్నర ఎకరాల భూమి లేఅవుట్ (జేబీఎన్ లేఔట్) అనుమతి కోసం ఎంపీవో రెండు లక్షలు, పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్‌లు ఐదున్నర లక్షలు లంచం డిమాండ్ చేశారు.

దీంతో విసిగిపోయిన లే అవుట్ యాజమాని ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నిన్న ఐదున్నర లక్షలు తీసుకుంటుండగా పంచాయతీ సెక్రెటరీ గీత, సర్పంచ్ భర్త కంది రమేష్, ఉపసర్పంచ్ బుర్రమోని నర్సింహ యాదవ్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం మహేశ్వరం ఎంపీడీవో ఆఫీసు, మంచాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న ఎంపీఓ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డిని సైతం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ పూర్యయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story