‘భగీరథ’ పనులకు.. మున్సిపల్ ట్రాక్టర్

by Sridhar Babu |   ( Updated:2020-07-27 06:34:41.0  )
‘భగీరథ’ పనులకు.. మున్సిపల్ ట్రాక్టర్
X

దిశ, సిరిసిల్ల: పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పట్టణంలోని తడి, పొడి చెత్తను సేకరించి, డంప్ యార్డుకు తరలించాల్సిన ట్రాక్టర్లు మిషన్ భగీరథ పనుల కోసం ఇసుక రవాణా చేసే పనికి కేటాయించారు. సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలోనే ఈ చోద్యం చోటు చేసుకుంది. పట్టణంలోని పద్మానగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పనుల కోసం ఇసుక రవాణా చేసేందుకు ప్రైవేటు వాహనాలు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ అధికారులు ఇసుక రవాణాకు మున్సిపల్ ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ అడగ్గా మంత్రి కేటీఆర్ ఆగస్టు 15 కల్లా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని ఆదేశించారని అయితే ఇసుక రవాణా చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మున్సిపల్ ట్రాక్టర్లను వినియోగిస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. చెల్లించాల్సిన అద్దెను మున్సిపాలిటీకి చెల్లిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed