- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణకు పంచభూతాల శని ఆ ఐదుగురే : రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ భూముల అమ్మకంలో టీఆర్ఎస్ బడా దోపిడీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అంటూ చెప్పే కేసీఆర్… తన బంధువులు, అనుచరులకు దోచి పెట్టేందుకే ఈ భూములను విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ భూముల అమ్మకాల్లో కేసీఆర్, కేటీఆర్ పెద్ద స్కెచ్ వేశారని, ధరల విషయంలో కూడా మోసం చేస్తున్నారన్నారు. ముందుగా రూ.60 కోట్లు పలికిన ప్లాట్‌కు పక్కనే ఒక్క రోజు తర్వాత కేవలం రూ.30 కోట్లు మాత్రమే నిర్ణయించారని, కేసీఆర్ బంధువుల కోసమే ఈ ప్లాన్అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌కు నమ్మకంగా ఉంటూ పనులు చక్కబెడుతున్న అధికారులు, నేతలకు ఈ భూములను అమ్ముతున్నారని మండిపడ్డారు. భూముల అమ్మకాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, లేకుంటే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు.
రామేశ్వర్రావు కోసమే..
భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల గోల్‌మాల్ అయిందని, పారిశ్రామికవేత్త రామేశ్వరరావు కుమారులకు భూములు కట్టబెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రామేశ్వరరావు కంపెనీలకు కేసీఆర్ వందలకోట్ల లబ్ధిచేకూర్చారని, టీఆర్‌ఎస్ నేతల కుటుంబాల వారే భూములు కొన్నారని, కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా భూములు కొన్నారని, వెంకట్రామిరెడ్డికి చెందిన రెండు కంపెనీలు తొమ్మిదిన్నర ఎకరాలు కొన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిళ్లిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఐదుగురు కలిసి వెయ్యి కోట్లు కొల్లగొట్టారని, దేశంలోని ప్రధాన కంపెనీలను టెండర్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. భూములు అమ్ముకుంటూపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.60 కోట్ల కంటే తక్కువ అమ్ముడుపోయిన భూముల వేలం రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎస్ సోమేశ్‌కుమార్ తెలంగాణలో పని చేసేందుకు అనర్హుడని, సెంట్రల్అడ్మినిస్ట్రేటివ్ కూడా ఆయన్ను ఏపీకి వెళ్లాలని ఆదేశించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రానికి కేటాయించిన అధికారిని తెలంగాణకు సీఎస్ చేశాడని, నియమనిబంధనలను ఉల్లంఘించారన్నారు. సోమేశ్‌కుమార్ ఎనిమిదేండ్లు బయటకు వెళ్లి పని చేశారని, ఈ సర్వీసును ఆయన సర్వీసు రిజిస్టర్ నుంచి తొలిగించాలన్నారు.
కోర్టుకు వెళ్లి తెలంగాణ అధికారిగా కొనసాగుతున్నాడని, ఇప్పుడు ఆయన ఫైల్ మిస్సింగ్అయిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేసే అక్రమాలకు సీఎస్‌గా సోమేశ్‌కుమార్ సంతకాలు పెడుతున్నారన్నారు. రెరా చైర్మన్‌గా భూముల దందాలో ఉన్నాడని, సోమేశ్‌కుమార్, అర్వింద్ కుమార్, లోకేశ్ కుమార్, మంత్రి కేటీఆర్, ఆయన స్నేహితులు శ్రీధర్ కలిసి రాష్ట్రానికి పంచభూతాల శని అని ఆరోపించారు.