తేలిన రెండో రౌండు ఫలితం… పల్లాదే ఆధిక్యం

by Anukaran |   ( Updated:2021-03-17 20:48:01.0  )
తేలిన రెండో రౌండు ఫలితం… పల్లాదే ఆధిక్యం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కు సంబంధించి రెండో రౌండ్ ఫలితం తేలింది. రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 3 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యం సంపాదించారు. రెండో రౌండ్ లో మొత్తం ఓట్లు 55991 కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15857 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు12070, కోదండరాంకు 9448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 6669, రాములు నాయక్ కు 3244, రాణిరుద్రమకు 1634, చెరుకు సుధాకర్ కు 1330, జయసారధి రెడ్డికి 1263 ఓట్లు వచ్చాయి. కాగా చెల్లని ఓట్లు 3009 ఉన్నాయి. రెండో రౌండ్ లో పల్లా కు 3787ఓట్ల ఆధిక్యం రాగా, రెండు రౌండ్లలో కలిపి 7871 ఓట్ల ఆధిక్యం సాధించారు.

New doc 18 Mar 2021 6.52 am

Advertisement

Next Story