- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్కంఠ పోరులో భారత్‌పై పాకిస్తాన్ గెలుపు
దిశ, వెబ్‌డెస్క్: అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు చివరి బంతికి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49 ఓవర్లకు 237 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్ జట్టులో వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించగా, ఓపెనర్ హర్నూర్ సింగ్ 46 పరుగులు చేశాడు. చివరి పదో నంబర్ బ్యాటర్ రాజవర్ధన్ హంగర్గేకర్ 20 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టు స్కోర్ 200 దాటించాడు. మిగిలిన వారు అంతగా రాణించలేకపోయారు. దీంతో భారత్ 49 ఓవర్‌లకు 237 పరుగులకు ఆలౌటైంది.
238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 69 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. కానీ, ఆ తర్వాత లక్ష్యం వైపు స్కోరు బోర్డును తీసుకెళ్లారు బ్యాటర్లు. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 8 పరుగులు చేయాల్సిన సమయంలో తొలి బంతికే జీషన్ జమీర్‌ను డకౌట్ చేశాడు రవికుమార్. ఈ క్రమంలో మరో బ్యాటర్ అహ్మద్ ఖాన్ చివరి వరకు ఆడి 19 బంతుల్లో 29 పరుగులు చేయడంతో.. ఇన్నింగ్స్ చివరి బంతికి పాకిస్థాన్‌కు విజయాన్ని అందించాడు. దీంతో 2 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది.