- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తల్లిని కిడ్నాప్ చేశారు : నటి మీరా
దిశ, సినిమా : పాకిస్థాన్ నటి మీరా తల్లి కిడ్నాప్‌కు గురైంది. కాగా ఈ విషయంలో తక్షణమే హెల్ప్ చేయాలంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరుతూ లేఖ రాసింది మీరా. తమ ఫ్యామిలీకి చెందిన ప్రాపర్టీని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ భూకబ్జాదారు తన తల్లిని కిడ్నాప్ చేసినట్టు ఆరోపించిన మీరా.. అతని పేరు ‘మియాన్ షాహిద్ మహమూద్’ అని వెల్లడించింది.
తమ ప్రాపర్టీలో మొదట అద్దెకు ఉండేందుకు అంగీకరించిన సదరు వ్యక్తి.. ఆ తర్వాత ఆస్తిని అక్రమంగా కాజేసేందుకు ట్రై చేస్తున్నట్టు చెప్పింది. ఈ క్రమంలోనే మీరా తల్లిని కిడ్నాప్ చేయగా.. లాహోర్‌లోని సీసీపీఓకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకోవాలని కోరింది. తన కెరియర్ మొత్తాన్ని దేశం కోసం ధారబోశానని, ఇప్పుడు తన ప్రాపర్టీని కబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.