చరిత్ర సృష్టించిన పాకిస్తాన్..

by Shyam |   ( Updated:2021-12-14 08:14:40.0  )
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్..
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ జట్టు టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే క్యాలెండర్ ఇయర్ (2021)లో అత్యధిక టీ20 మ్యాచ్‌లలో విజయం సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది పాకిస్తాన్ జట్టు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో గెలుపొందింది. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది ఈ ఏడాది పాక్‌ జట్టుకు 18వ విజయం. గతంలో 2018లో పాకిస్తాన్ జట్టు 17 విజయాలు సాధించి రికార్డు సృష్టించగా.. తాజాగా తన రికార్డును తానే అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇక సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ తక్కువ స్కోరుకే అవుటైనా.. మహ్మద్ రిజ్వాన్ (78), హైదర్ అలీ (68) అర్ధ శతకాలకు తోడు నవాజ్ (30) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ రాబట్టింది. పాక్ జట్టు విధించిన 200 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ షాయ్ హోప్ (31) మినహా ఎవరూ రాణించకపోవడంతో పాక్ గెలుపు నల్లేరు మీద నడక అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed